Monday, October 11, 2010

బ్రౌన్ దొర గారి సమాధి





గత ఆగష్టులో భారత యాత్ర సందర్భంగా.. లండన్ లో ఆగడం జరిగింది. ఆ స్మశానం లో ఆయన సమాధి వెతికి పట్టుకోవడం కొంచెం కష్టం. గురువుగారు శ్రీ వంగూరి చిట్టెంరాజు ఇచ్చిన ఆనవాళ్ళతో మహానుభావుడు బ్రౌన్ దొర సమాధి ని దర్శించడంనా ఆదృష్టం. ఆయన సమాధిని దర్శించిన అతి కొద్ది తెలుగు వాళ్ళలో నేను కూడా ఒకడిని అయ్యాను. జీర్ణావస్త లో వున్న బ్రౌన్ సమాధిని లండన్ తెలుగు సమాఖ్య వాళ్ళు పునరుద్దరించి పుణ్యం కట్టుకున్నారు.


Tuesday, May 25, 2010

Friday, November 6, 2009

టాక్ షొ తల్లులు

మీలో ఎంతమంది తెలుగు టీవి చూస్తారో తెలియదు కాని.. చూడక పోతే మాత్రం, మీరు ఏమీ మిస్ కావడం లేదు. వారమంతా తెగ పనిచేసి అలిసిపోయను కాస్త కాలక్షేపంగా వుంటుంది అని నిన్న ఆదివారం కాసేపు "బుల్లి తెర" తీసా...అంతే... ఎప్పుడూ కంపు కొట్టె రాజకీయ వార్తలు, ఫలనా సినిమా తార కి ఫలనా దర్శకుడికి మధ్య ఏదో ఉందని పదే పదే చెపుతూ, ఆ విషయం పై మీ అభిప్రాయం మా స్టూడియో కి ఫోన్ చేసి చెప్పండి అని పదే పదే ప్రాణాలు తోడేసే సినిమా వార్తలు, ఒబామాకి నోబుల్ శాంతి బహుమతి రావడం మీ శ్రీమతికి సమ్మతమేనా అని ప్రశ్నించే అంతర్జాతీయ వార్తలు, ఆముదాలవలసలో జరిగిన అన్యాయం అంటూ "ఎలుకను తిన్న పిల్లి" శీర్షిక తో క్రైం(నేర) వార్తలు.. ఇలా మీకు ఓపిక ఉండాలేగాని.. ఆ బుల్లి తెర మన తెలుగు చానల్స్ పుణ్యమా అని తన పేరుని(ఇడియట్ బాక్స్) సార్థకం చేసుకుంటొంది. ఇక.. ఆయా కార్యక్రమాలలో తెంగ్లిష్ మాట్లడుతూ.. అటు తెలుగు ఇటు ఆంగ్లం(ఇంగ్లీష్)సరిగా రాని "ఏంకరమ్మలు", "నా ఖర్మకాలి నెను మీకు ఇలా టీవీ లో కనిపిస్తున్నానుగాని నా అంత అందగాడు ఈ భూపెపంచకంలో లేడు" అని మురిసి ముక్కలయ్యే "ఏంకరయ్యలు", వీళ్ళందరినీ మించి నోటికొచ్చినదంతా వాగుతూ తమను తాము ఓప్రా వింఫ్రే కి పోటీగా భావించే "టాక్ షో తల్లులు" నన్ను ఈ వ్యాసం రాయడానికి పంపారు. ప్రస్తుతానికి నన్ను బాగా ఆకట్టుకున్న(గొంతు పట్టుకున్న అంటే బాగుంటుందేమో) టాక్ షో తల్లుల మహాత్మ్యం మీకు చెప్పాలి. ముఖ్యంగా ఒక ఇద్దరు తల్లులు నాకు జ్ఞానోదయం చేసారు ..

మొదటగా! అద్భుతమైన ఆపాత మధుర గీతాలను రీమిక్స్ పేరుతొ పాతరేసి, అతితక్కువ బట్టలతో ప్రచార వీడియోలు రూపొందించి జనానికి కిర్రెక్కించిన ఒక సుందరి... ఛానల్ పేరు గుర్తులేదుకాని "ముస్తఫా ముస్తఫా" పేరుతొ ఈవిడ ఒక టాక్ షో అనే కార్యక్రమం నడిపిస్తోంది.. తన పాత గుర్తింపు తో(అబ్బా అదేనండి.. తక్కువ బట్టలు..వెకిలి నవ్వు.. గట్ర..గట్రా!!)ఆ కార్యక్రమం ఎవరిని అలరిస్తోందో మీకు నేను చెప్పనక్కరలేదనుకుంటా. కావాలంటే మీరే ఒక్క సారి ఆ కార్యక్రమం చూడండి(పెళ్ళైన మగవారికి గమనిక: ఆ ప్రోగ్రాం చూసెప్పుడు మీ శ్రీమతి చుట్టుపక్కల లేకుండా జాగ్రత్త పడండి, లేకపొతే మీ శ్రీమతి తిట్ల పురాణానికి ఆ సుందరి తో పాటు మీరు కూడ బలైపోగలరు.)

(ఇంకా వుంది...)

Tuesday, March 17, 2009

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులు - పేరయ్య పేరడి !!


(అప్పు చేసి పప్పు కూడు పాటకి పేరడి - పింగళి వారికి క్షమార్పణలతో. మార్పు చేర్పులకు స్వాగతం )

కార్డు వాడి కూరలన్ని కొనరా ఓ నరుడా
ఒబమా వారు చెప్పిందిదే వినరా సిటిజెనుడా!! |కార్డు వాడి |

1. గాంబ్లింగు వద్దు రిస్కురా, స్టాక్స్కు ఇష్కు మత్తురా
డాలరు డాలరు కూడబెట్టి ఇండియాలో దాచరా!! |కార్డు వాడి |

2. సోనా మసూరి ఆపరా, లాంగు గ్రైను వాడరా
రోటి నీకు నచ్చకుంటె, ఫాస్టు ఒకటె ఆప్షనురా!! |కార్డు వాడి |

3. గాసు రేటు పెరిగెరా, వ్యాలెటు వైటు తరిగెరా
బైకు బూజు దులిపి నువ్వు, రాజా లాగ కదలరా!! |కార్డు వాడి |

4. దేవుడే దిక్కురా, గుడికి వెళ్ళి మొక్కరా
రిసెషనున్న టైములొ ఆప్షనింక లేదురా |కార్డు వాడి |

Sunday, March 9, 2008

ఇంటెర్నెట్ లో వాడుకలో ఉన్న కొన్ని ఆంగ్ల పదములకు తెలుగు తర్జుమా

ఇంటెర్నెట్ లో వాడుకలో ఉన్న కొన్ని ఆంగ్ల పదములకు తెలుగు తర్జుమా...

ఇంటెర్నెట్ - అంతర్జాలం

ఈమెయిల్ - విద్యుల్లేఖ

రికార్డింగ్ స్టూడియో - ధ్వని ముద్రణాలయం

ఎయిర్ హొస్టెస్ - గగన సఖి

(మీకూ తెలిసిన తర్జుమాలను ఇవ్వండి)

Sunday, February 3, 2008

దిగుమతి చేసుకున్న సినీతారలు - మన సాంప్రదాయాలు

ఒక సినీ నటి "శివాజి" వంద రోజుల సభకు చాల తక్కువ దుస్తులతో వచ్చిందని మన తమిళ సోదరులు నానా యాగీ చేసారని మొన్న ఆ మధ్య పేపర్ లో చదివాను.. ఆ విషయం వాళ్ళ అసెంబ్లీ లో కూడా చర్చించారని ఆ తరువాత ఆ నటి తమిళనాడు ప్రజలందరికి క్షమార్పణలు చెప్పిందని కూడ చదివాను.

ఆహా తమిళ సోదరులు!!! అదే నటి అంతకంటె తక్కువ దుస్తులతో చాల చిత్రాలలో నటిస్తె! విరగబడి చూసారు.
తమిళ సోదరులను విమర్సించదం నా వుద్దేశ్యం కాదు కాని, గుల్టీలు అని పిలవబడే మనం కూడ కొన్ని విషయాలు వాళ్ళ నుండి నేర్చుకొవాలి నా అభిప్రాయం.

సదరు నటీ మణి లాంటి మరెందరో తారలు(వీళ్ళను నిజంగా తారలు ని పిలవడం సబబు కాదని నా ఉద్దేశ్యం. ఏందుకంటె, అరువు గొంతుకలతొ, అసభ్య దుస్తులతో, ఎటువంటి భావాలు పలికించలెకుండా నటించగలరు కాబట్టి)సినిమాలోనే కాదు, బయట కూడా అంటే ఆడియో విడుదల, సినిమా ఘొరంగా ఫైల్ అయినా జరిగె మొహమాటపు విజయోత్సవ సభలకు చాల అసభ్యకరమైన దుస్తులతో విచ్చెయడం గమనిచ వచ్చు.

వారి చిత్రాలను, వారి తెంగ్లిష్ మాటలను, శరీర ప్రదర్శనను తెలుగు ప్రజలు విమర్శించి క్షమార్పణాలను కోరరని, మన ప్రజా నాయకులు తమ విలువైన సమయాన్ని ప్రజలను ఏ పథకం ద్వార దోచుకుందామా అని వినియోగిస్తారే తప్ప ఇలాంటి విషయాలకు విలువ ఇవ్వరని తెలుగు వాళ్ళందరూ గొప్పగా చెప్పుకో వచ్చు.


అయినా తెరమీద, తెర బయటా రెండూ రకాలుగా ఉండాలని సదరు ఉత్తర భారత దేశ వికారులకు(తారలు అనడం నాకు ఇష్టం లేదని తమకు ముందే విన్నవించుకున్నాను)మన దక్షిణ భారత దేశం వీళ్ళ ఖర్మ కోద్దీ ఇంకా కొన్ని సాంప్రదాయాలను కొనసాగిస్తున్నదని తెలియదని కొంచెం సానుభూతితో వదిలెద్దాం.


ఈ విషయమై మీ అభిప్రయాలను నిర్మొహమాటంగా తెలుపగలరు

Thursday, January 24, 2008

పేరడి గారడి

కాళి దాసు కవిత్వమో లేక మన పైత్యమో... అని... అప్పుడప్పుడు.. కొన్ని పేరడీలు వ్రాస్తుంటాను...
ఏ కవిని గాని రచయితని గాని కించ పరచదం నా ఉద్దెశం కాదు.
ఇవిగో.. ఇక్కడ చూడండి.. పంటికింద రాయిలా అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పండి.


చిత్రం : మూగ మనసులు
పాట : పాడుతా తియ్యగ.. చల్లగా..
సందర్భం : వంట చెయ్య మని ప్రాణం తీస్తున్న భార్య గోడు తట్టుకో లేని భర్త పాడుతున్న పాట.
మనసుకవి ఆత్రేయ గారికి క్షమార్పణలతో
పల్లవి:
వండుతా ఉప్పగా చప్పగా... టేస్టుచేసిపోవచ్చుగా క్వయిటుగా... కాదంటె ఫైటుగా...
చరణం 1: వైటు చేస్తె రైసు కాస్త వుడుకు పడతది... వుడుకు కాస్తా ఎక్కువైతె మాడి పోతది.
టేస్టు అంటు లేనిదమ్మ ఆకలన్నది.. గంట గంటకది మరీ ఎక్కువౌతది ..
|వండుతా.... ఉప్పగా|

చరణం 2:
కడుపులోన కాలితే చల్లన్నం చిత్రాన్నం.. అడగమన్న అడగవమ్మ పరమాన్నం
పొయింది.. అయ్యో మన కుక్కర్ .. మిగిలింది .. లాస్టు వీకు లెఫ్టొవెర్
|వండుతా.... ఉప్పగా|



చిత్రం :
పాట : భలే మంచి రోజు .. పసందైన రోజు..
సందర్భం : హెచ్ 1 కాంట్రక్టర్ ని .. కన్సల్టింగ్ కంపని రిక్రూటర్.. కధలు చెప్పి ప్రొజెక్టు లొ ఇరికించదానికి పాడుతున్న పాట.

పల్లవి:
భలే మంచి రేటు.. డౌను టౌను క్లైంటు..
లాంగు టర్ము నడిచే ఓ ప్రాజెక్టు..
చరణం 1:
పర్ డియం ఫరవాలేదు.. ఓవర్ టైము చేసుకొవచ్చు
క్లైంటు గనక నచ్చాడంటె.. ఫుల్ టైం గా మారిపొవచ్చు
ప్రీమియమ్ము ప్రాససింగుతొ గ్రీను కార్డునే కొట్టెయ్యొచ్చు |భలే మంచి రేటు|
చరణం 2:
ఇంటర్నెట్ బ్రౌసు చెయ్యొచ్చు.. చాటింగులు చేసుకోవచ్చు
గూగుల్ టాకు వాడుకుంటు.. ఇండియాకు మాట్లాడొచ్చు
కాంఫరెన్సు కాల్సు అన్ని కునికి పాట్లతో నెట్టెయ్యొచ్చు |భలే మంచి రేటు|