Sunday, March 9, 2008

ఇంటెర్నెట్ లో వాడుకలో ఉన్న కొన్ని ఆంగ్ల పదములకు తెలుగు తర్జుమా

ఇంటెర్నెట్ లో వాడుకలో ఉన్న కొన్ని ఆంగ్ల పదములకు తెలుగు తర్జుమా...

ఇంటెర్నెట్ - అంతర్జాలం

ఈమెయిల్ - విద్యుల్లేఖ

రికార్డింగ్ స్టూడియో - ధ్వని ముద్రణాలయం

ఎయిర్ హొస్టెస్ - గగన సఖి

(మీకూ తెలిసిన తర్జుమాలను ఇవ్వండి)

Sunday, February 3, 2008

దిగుమతి చేసుకున్న సినీతారలు - మన సాంప్రదాయాలు

ఒక సినీ నటి "శివాజి" వంద రోజుల సభకు చాల తక్కువ దుస్తులతో వచ్చిందని మన తమిళ సోదరులు నానా యాగీ చేసారని మొన్న ఆ మధ్య పేపర్ లో చదివాను.. ఆ విషయం వాళ్ళ అసెంబ్లీ లో కూడా చర్చించారని ఆ తరువాత ఆ నటి తమిళనాడు ప్రజలందరికి క్షమార్పణలు చెప్పిందని కూడ చదివాను.

ఆహా తమిళ సోదరులు!!! అదే నటి అంతకంటె తక్కువ దుస్తులతో చాల చిత్రాలలో నటిస్తె! విరగబడి చూసారు.
తమిళ సోదరులను విమర్సించదం నా వుద్దేశ్యం కాదు కాని, గుల్టీలు అని పిలవబడే మనం కూడ కొన్ని విషయాలు వాళ్ళ నుండి నేర్చుకొవాలి నా అభిప్రాయం.

సదరు నటీ మణి లాంటి మరెందరో తారలు(వీళ్ళను నిజంగా తారలు ని పిలవడం సబబు కాదని నా ఉద్దేశ్యం. ఏందుకంటె, అరువు గొంతుకలతొ, అసభ్య దుస్తులతో, ఎటువంటి భావాలు పలికించలెకుండా నటించగలరు కాబట్టి)సినిమాలోనే కాదు, బయట కూడా అంటే ఆడియో విడుదల, సినిమా ఘొరంగా ఫైల్ అయినా జరిగె మొహమాటపు విజయోత్సవ సభలకు చాల అసభ్యకరమైన దుస్తులతో విచ్చెయడం గమనిచ వచ్చు.

వారి చిత్రాలను, వారి తెంగ్లిష్ మాటలను, శరీర ప్రదర్శనను తెలుగు ప్రజలు విమర్శించి క్షమార్పణాలను కోరరని, మన ప్రజా నాయకులు తమ విలువైన సమయాన్ని ప్రజలను ఏ పథకం ద్వార దోచుకుందామా అని వినియోగిస్తారే తప్ప ఇలాంటి విషయాలకు విలువ ఇవ్వరని తెలుగు వాళ్ళందరూ గొప్పగా చెప్పుకో వచ్చు.


అయినా తెరమీద, తెర బయటా రెండూ రకాలుగా ఉండాలని సదరు ఉత్తర భారత దేశ వికారులకు(తారలు అనడం నాకు ఇష్టం లేదని తమకు ముందే విన్నవించుకున్నాను)మన దక్షిణ భారత దేశం వీళ్ళ ఖర్మ కోద్దీ ఇంకా కొన్ని సాంప్రదాయాలను కొనసాగిస్తున్నదని తెలియదని కొంచెం సానుభూతితో వదిలెద్దాం.


ఈ విషయమై మీ అభిప్రయాలను నిర్మొహమాటంగా తెలుపగలరు

Thursday, January 24, 2008

పేరడి గారడి

కాళి దాసు కవిత్వమో లేక మన పైత్యమో... అని... అప్పుడప్పుడు.. కొన్ని పేరడీలు వ్రాస్తుంటాను...
ఏ కవిని గాని రచయితని గాని కించ పరచదం నా ఉద్దెశం కాదు.
ఇవిగో.. ఇక్కడ చూడండి.. పంటికింద రాయిలా అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పండి.


చిత్రం : మూగ మనసులు
పాట : పాడుతా తియ్యగ.. చల్లగా..
సందర్భం : వంట చెయ్య మని ప్రాణం తీస్తున్న భార్య గోడు తట్టుకో లేని భర్త పాడుతున్న పాట.
మనసుకవి ఆత్రేయ గారికి క్షమార్పణలతో
పల్లవి:
వండుతా ఉప్పగా చప్పగా... టేస్టుచేసిపోవచ్చుగా క్వయిటుగా... కాదంటె ఫైటుగా...
చరణం 1: వైటు చేస్తె రైసు కాస్త వుడుకు పడతది... వుడుకు కాస్తా ఎక్కువైతె మాడి పోతది.
టేస్టు అంటు లేనిదమ్మ ఆకలన్నది.. గంట గంటకది మరీ ఎక్కువౌతది ..
|వండుతా.... ఉప్పగా|

చరణం 2:
కడుపులోన కాలితే చల్లన్నం చిత్రాన్నం.. అడగమన్న అడగవమ్మ పరమాన్నం
పొయింది.. అయ్యో మన కుక్కర్ .. మిగిలింది .. లాస్టు వీకు లెఫ్టొవెర్
|వండుతా.... ఉప్పగా|



చిత్రం :
పాట : భలే మంచి రోజు .. పసందైన రోజు..
సందర్భం : హెచ్ 1 కాంట్రక్టర్ ని .. కన్సల్టింగ్ కంపని రిక్రూటర్.. కధలు చెప్పి ప్రొజెక్టు లొ ఇరికించదానికి పాడుతున్న పాట.

పల్లవి:
భలే మంచి రేటు.. డౌను టౌను క్లైంటు..
లాంగు టర్ము నడిచే ఓ ప్రాజెక్టు..
చరణం 1:
పర్ డియం ఫరవాలేదు.. ఓవర్ టైము చేసుకొవచ్చు
క్లైంటు గనక నచ్చాడంటె.. ఫుల్ టైం గా మారిపొవచ్చు
ప్రీమియమ్ము ప్రాససింగుతొ గ్రీను కార్డునే కొట్టెయ్యొచ్చు |భలే మంచి రేటు|
చరణం 2:
ఇంటర్నెట్ బ్రౌసు చెయ్యొచ్చు.. చాటింగులు చేసుకోవచ్చు
గూగుల్ టాకు వాడుకుంటు.. ఇండియాకు మాట్లాడొచ్చు
కాంఫరెన్సు కాల్సు అన్ని కునికి పాట్లతో నెట్టెయ్యొచ్చు |భలే మంచి రేటు|

Saturday, January 19, 2008

శుభారంభం

అందరూ వాళ్ళ బ్లాగులకి అందమైన పేర్లు పెట్టుకుంటే వీడేంట్రా గోంగూర... ఆవకాయ లాంటి పేరు పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా!!

మరి అదే వెరైటి అంటే.. "శాకంబరీ దేవీ ప్రసాదం.. ఆంధ్ర శాఖం .. గోంగూర" అని మాయ బజార్ లో అల్లూ రామలింగయ్య గారు అన్నారు కదండి. ఆందుకని నా బ్లాగుకి అచ్చమైన తెలుగు పేరు పెట్టానండి.. అదీ సంగతి..

"తెలుగు భాష తియ్యదనం.. తెలుగు జాతి గొప్పదనం.. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూల ధనం" కదా..

ఇక వారం వారం.. కుదిరితే ప్రతీ రోజూ.. ఈ బ్లాగుని మంచి..మంచి విషయలటో అప్ డేట్ చేస్తాను.

ఇదేదొ.."ఇందిర ఇటికరాయి పథకం, రాజీవ్ రాయి రప్పా పధకం" కాదు కదా,అందుకని.. ఏదైన తప్పులు వుంటే.. మంచి మనసుతో మన్నించి.. మీ సలహాలు, సూచనలు అందిచగలరని ఆశిస్తూ ఈ రోజుకు శెలవు తీసుకుంటున్నాను.