అందరూ వాళ్ళ బ్లాగులకి అందమైన పేర్లు పెట్టుకుంటే వీడేంట్రా గోంగూర... ఆవకాయ లాంటి పేరు పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా!!
మరి అదే వెరైటి అంటే.. "శాకంబరీ దేవీ ప్రసాదం.. ఆంధ్ర శాఖం .. గోంగూర" అని మాయ బజార్ లో అల్లూ రామలింగయ్య గారు అన్నారు కదండి. ఆందుకని నా బ్లాగుకి అచ్చమైన తెలుగు పేరు పెట్టానండి.. అదీ సంగతి..
"తెలుగు భాష తియ్యదనం.. తెలుగు జాతి గొప్పదనం.. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూల ధనం" కదా..
ఇక వారం వారం.. కుదిరితే ప్రతీ రోజూ.. ఈ బ్లాగుని మంచి..మంచి విషయలటో అప్ డేట్ చేస్తాను.
ఇదేదొ.."ఇందిర ఇటికరాయి పథకం, రాజీవ్ రాయి రప్పా పధకం" కాదు కదా,అందుకని.. ఏదైన తప్పులు వుంటే.. మంచి మనసుతో మన్నించి.. మీ సలహాలు, సూచనలు అందిచగలరని ఆశిస్తూ ఈ రోజుకు శెలవు తీసుకుంటున్నాను.
1 comment:
గోంగూర పచ్చడి లాగా మీ బ్లాగు ఘుమ ఘుమలాడాలని కోరుకుంటున్నాను. మంచి మంచి విషయాలతో తరచుగా బ్లాగండి.
Post a Comment